విశాఖ మేయర్ పై అవిశ్వాసం నేడు

నేడు విశాఖపట్నం మేయర్ పై అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం జరగనుంది

Update: 2025-04-19 02:34 GMT

నేడు విశాఖపట్నం మేయర్ పై అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం జరగనుంది. మేయర్ హరి వెంకటకుమారిపై ఇచ్చిన అవిశ్వాసానికి నేడు ఓటింగ్ జరిగే అవకాశముంది. ఇప్పటికే క్యాంప్ లలో ఉన్న కార్పొరేటర్లు విశాఖకు చేరుకున్నారు. కూటమి పార్టీకి చెందిన కార్పొరేటర్లు మలేషియాకు వెళ్లి నిన్న సాయంత్రమే విశాఖకు తిరిగి వచ్చారు. వైసీపీ తన పార్టీకి చెందిన కార్పొరేటర్లను ఊటీలో ఉంచింది. అయితే వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.

వైసీపీ దూరంగా...
ఈ మేరకు విప్ జారీ చేసింది. మ్యాజిక్ ఫిగర్ కు చేరామని కూటమి నేతలు చెబుతుండగా, తమకే బలం ఉందని వైసీపీ చెబుతుంది. తాజాగా నలుగురు వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరడంతో కూటమి బలం పెరిగినట్లయిందని అంటున్నారు. ఓటింగ్ కు నేరుగా విశాఖ మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి యాభై ఎనిమిది కార్పొరేటర్లు వైసీపీ నుంచి గెలవగా, అందులో 25 మంది టీడీపీ, జనసేనల్లో చేరిపోయారు.


Tags:    

Similar News