Visakhapatnam : విశాఖ ఆర్కే బీచ్ రోడ్డు క్లోజ్.. అటు వెళుతున్నారా? అయితే జాగ్రత్త

నేటి నుంచి విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌రోడ్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు

Update: 2025-06-17 04:12 GMT

నేటి నుంచి బీచ్‌రోడ్‌లో పోలీసుల ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ఈ నెల 21వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో పాల్గొనేందుకు విశాఖపట్న వస్తుండటంతో బీచ్ రోడ్డులో వెళ్లే వారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నెల 21వ తేదీ వరకూ ఆర్కే బీచ్ రోడ్డును మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ట్రాఫిక్ ఆంక్షలు...
నేవల్ కోస్ట్ నుంచి పార్క్‌ హోటల్‌ వరకు రెడ్‌జోన్ గా ప్రకటించిన పోలీసులు ప్రధాని పర్యటన సందర్బంగా అక్కడకు ఎవరినీ అనుమతించడం లేదు. ఈనెల 21 వ తేదీ వరకు ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీచ్ రోడ్డు మీదుగా వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు వాహనదారులకు సూచించారు.


Tags:    

Similar News