విశాఖ మేయర్ గా పీలా శ్రీనివాసరావు
విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నికయ్యారు
విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. పీలా శ్రీనివాసరావుకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ధ్రువపత్రం అందించారు. పీలా శ్రీనివాసరావు పేరును జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రతిపాదించడంతో ఆయన ఎన్నికను మెజారిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
జనసేన బలపర్చిన...
పీలా శ్రీనివాసరావు మేయర్ అభ్యర్థిగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపర్చారు. జీవీఎంసీ మేయర్ గా పీలా శ్రీనివాసరావు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. చాలా రోజుల తర్వాత విశాఖ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకున్నట్లయింది. ఇక డిప్యూటీ మేయర్ పదవిని ఎంపిక చేయాల్సి ఉంది.