నేడు ఐఎన్ఎస్ నిస్తార్ నౌకను జాతికి అంకితం
. ఈరోజు విశాఖలో ఐఎన్ఎస్ నిస్తార్ నౌకను జాతికి అంకితం చేయనున్నారు.
విశాఖ నేవీ అమ్ముల పొదిలో మరొక అస్త్రం నేడు చేరనుంది. ఈరోజు ఐఎన్ఎస్ నిస్తార్ నౌకను జాతికి అంకితం చేయనున్నారు. ఆపదలో చిక్కుకునే జలాంతర్గాములను రక్షించేందుకు ఆధునిక టెక్నాలజీతో నిర్మితమైన నౌక ఐఎన్ఎస్ నిస్తార్. దీనిని అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినట్లు నేవీ వర్గాలు వెల్లడించాయి.
అత్యాధునిక పరిజ్ఞానంతో...
ప్రత్యేక డైవింగ్ టీమ్, బహుళపక్ష వినియోగ డెక్‍లు, హెలికాప్టర్ కలిగి ఉండటం ఐఎన్ఎస్ నిస్తార్ ప్రత్యేకతలు అని చెబుతున్నారు. ఈ ఐఎన్ఎస్ నిస్తార్ నౌక బరువు 10,500 టన్నులు కాగా 120 మీ. పొడవు కలిగి ఉంది. నేటి నుంచి నిస్తార్ ఐఎన్ఎస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ నౌకను ప్రారంభించనున్నారు.