వణుకుతున్న విశాఖ.. బలమైన ఈదురుగాలులు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం విశాఖపట్నంలో చూపుతుంది. బలమైన ఈదురుగాలులు వీచాయి
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం విశాఖపట్నంలో చూపుతుంది. బలమైన ఈదురుగాలులు వీచాయి. చెట్లన్నీ విరిగి కింద పడిపోయాయి. హోర్డింగ్ లు కూడా అనేక చోట్ల పడిపోయాయి. చెట్లు పడిపోవడంతో వాహనాల వాటి కింద పడి ఛిద్రమయ్యాయి. వర్షం కంటే ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురి చేస్తున్నారు.
బయటకు రావద్దంటూ...
విశాఖప్రజలు ఈరోజు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఎవరూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు. తీవ్ర వాయుగుండం తీరాన్నిదాటే సమయంలో మరింత బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.