నేడు పాఠశాలలకు సెలవు

భారీ వర్షాలతో విశాఖపట్నం, అల్లూరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Update: 2025-08-18 02:37 GMT

అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందర ప్రసాద్ తెలిపారు. విద్యార్థుల రక్షణ, భద్రత దృష్ట్యా ముందస్తుగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించిన్నట్లు పేర్కొన్నారు.

భారీ వర్షాలతో...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు వాయుగుండం ప్రభావంతో నిన్నటి నుంచి విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వరద నీరు చేరింది. దీంతో జిల్లా కలెక్టర్ నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.ఈరోజు అల్లూరి జిల్లాలోనూ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు సంబంధిత జిల్లా అధికారుల ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.


Tags:    

Similar News