నేడు విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక
నేడు గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.
నేడు గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. నిన్న సమావేశానికి టీడీపీ కార్పొరేటర్లు గైర్హాజరు కావడంతో సమావేశం కోరం లేక వాయిదా పడింది. జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చారని భావించి, అధినాయకత్వం నుంచి తమకు ఆదేశాలు అందకపోవడంతో టీడీపీ కార్పొరేటర్లు నిన్నటి సమావేశానికి డుమ్మా కొట్టారు.
జనసేనకు కేటాయించడాన్ని...
డిప్యూటీ మేయర్ జనసేనకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఓ వర్గం కార్పొరేటర్లు బఎన్నికను బహిష్కరించారు. నేడు కూడా టీడీపీ అసంతృప్త కార్పొరేటర్ల హాజరుపై ఉత్కంఠ నెలకొంది. అయితే అధినాయకత్వం ఆదేశాలతో నేడు సమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయని, సమావేశం సజావుగా జరుగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.