Visakhapatnam : విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సాకారం
విశాఖపట్నంలో మెట్రో రైలు పనులు త్వరితగితన ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.
విశాఖపట్నంలో మెట్రో రైలు పనులు త్వరితగితన ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. విశాఖపట్నంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మెట్రో రైలు నిరమాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దశల వారీగా మెట్రో పనులను చేపట్టాలని ప్రభుత్వం భావించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల ఆర్థిక సాయంతో ఈ మెట్రో ప్రాజెక్టును నిర్మించనున్నారు.
నేడు పర్యటన...
అయితే ఈరోజు మెట్రో రైలు ఎండీ రామకృష్ణ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఏఐఐబీ పరతినిధులు కూడా పర్యటించనున్నార. మెట్రో కారిడార్ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఇంజినీరింగ్ బృందంతో కూడా సమావేశం అవుతారు. దీంతో ఇప్పటికే మెట్రో రైలు నిర్మాణానికి అవసరమైన రుణాన్ని అందించేందుకు వివిధ ఆర్థిక సంస్థలు ముందుకు రావడంతో త్వరలోనే మెట్రో పనులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.