Visakhapatnam : విశాఖకు ఐటీ దిగ్గజం.. ఎనిమిది వేల మంది నిరుద్యుగలకు అవకాశం

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ అంగీకరించింది.

Update: 2025-06-20 08:20 GMT

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ అంగీకరించింది. మొత్తం 1582 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖపట్నంలో ప్రముఖ టెక్ సంస్థ కాగ్నిజెంట్ సంస్థ ఐటీ క్యాంపస్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ తో కాగ్నిజెంట్ ప్రతినిధులు వెల్లడించినట్లు సమాచారం.

ఎనిమిది వేల మందికి...
ఈ కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ విశాఖలో ఏర్పాటయితే కొత్తగా ఎనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఈ కాగ్నిజెంట్ సంస్థకు విశాఖపట్నంలో ఎకరా 99 పైసలకే భూమి కేటాయించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అంతర్జాతీయ స్థాయిలో ఐటీ క్యాంపస్ ఏర్పాటయితే భవిష్యత్ లోవిశాఖ ఐటీ హబ్ గా మారనుంది. విశాఖలోని కాపులుప్పాడ వద్ద కాగ్నిజెంట్ సంస్థకు 21 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడే ఐటీ క్యాంపస్ ను ఏర్పాటు చేయనుంది.


Tags:    

Similar News