Visakha : విశాఖలో నిలిచిన నీటి సరఫరా
విశాఖపట్నంలో తాగు నీటి సమస్య తలెత్తింది. రాత్రి నుంచి తాగు నీటి సరఫరా నిలిచిపోయింది
విశాఖపట్నంలో తాగు నీటి సమస్య తలెత్తింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెకు దిగడంతో జీవీఎంసీలో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి నుంచి మంచినీటి పంపింగ్ నిలిచి పోవడంతో పాటు, సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు తాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నారు.
కేజీహెచ్, ఎయిర్ పోర్టులో కూడా..
జీవీఎంసీ అన్ని జోన్లలో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమ్మెలో 2 వేల మంది పొరుగుసేవల కార్మికులు పాల్గొన్నారు. సిబ్బంది సమ్మెతో నగరమంతా మున్సిపల్ నీటి సరఫరా నిలిచిపోయింది. కేజీహెచ్, విమానాశ్రయానికి కూడా నీటి సరఫరా నిలిచి పోవడంతో రోగులతో పాటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.