Chandrababu : నేడు విశాఖపట్నానికి చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు.

Update: 2025-11-12 04:03 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు రుగుతున్న నేపథ్యంలో దానిపై అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం విశాఖపట్నానికి చేరుకుంటారు. ఈరోజు ఉదయం 9.10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గానికి బయలుదేరుతారు.

సాయంత్రం అక్కడి నుంచి...
ఉదయం10.40 గంటలకు చిన్నమండెం మండలం, దేవగుడిపల్లె గ్రామానికి చేరుకుంటారు. 10.55 గంటలకు పేదలతో కలిసి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.45 గంటలకు చిన్నమండెంలో ప్రజావేదిక సభలో పాల్గొని చంద్రబాబు ప్రసంగిస్తారు. 2.30 గంటలకు తెలుగుదదేశం పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 6.05 గంటలకు విశాఖపట్నానికి చంద్రబాబు చేరుకుంటారు.


Tags:    

Similar News