Andhra Pradesh : నేడు విశాఖకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా

నేడు విశాఖలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు

Update: 2025-09-14 03:17 GMT

నేడు విశాఖలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. విశాఖపట్నంలోని రైల్వే గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ సంస్థాగత విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై కూడా నేతలతో జేపీ నడ్డాఈ సందర్భంగా చర్చించనున్నారు.

స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో...
స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పాల్గొనే జేపీ నడ్డా పార్టీ బలోపేతం పై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తాముపోటీ చేయాల్సిన స్థానాలను గురించి కూడా డిసైడ్ చేయాలని, నామినేటెడ్ పదవుల విషయంలోనూ ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. విశాఖ లో 98 డివిజన్ లనుండి బిజెపి శ్రేణులు బహిరంగ సభ కు హాజరు కానున్నారు.


Tags:    

Similar News