నేడు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక సమావేశం

నేడు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక సమావేశం జరగనుంది.

Update: 2025-04-26 03:12 GMT

నేడు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌పై అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీధర్ పై అవిశ్వాసం నోటీసును కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన నేపథ్యంలో నేటి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

మేయర్, డిప్యూటీ మేయర్...
ఇప్పటికే మేయర్‌పై అవిశ్వాసం నెగ్గిన కూటమి పార్టీలు డిప్యూటీ మేయర్ పదవిని కూడా కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మేయర్ టీడీపీ, డిప్యూటీ మేయర్ పదవిని జనసేన తీసుకునేలా ఒప్పందం జరిగింది. ఈనెల 28న మేయర్‌ పదవి ఎన్నికకు ప్రత్యేక సమావేశం కానుంది. అదేరోజు మేయర్,డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకునేలా రంగం సిద్ధం చేశారు.


Tags:    

Similar News