మధ్యప్రదేశ్ లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8 మంది సిమి ఉగ్రవాదులు పరారయ్యారు. జైలు గార్డ్ ను హత్య చేసి గోడ దూకి వీరు పారిపోవడం విశేషం. పారిపోయిన ఉగ్రవాదుల ఫోటోలను జైలు అధికారులు విడుదల చేసారు. భోపాల్ పరిసరాల్లో వీరికోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
సిమి ఉగ్రవాదులు ఎంత ప్రమాదకరమైన వ్యక్తుల్లో అందరికి తెలిసిన సంగతే. దేశవ్యాప్తంగా పలు ఉగ్రవాద కార్యకలాపాలు, ఘోరాలతో సిమికి సంబంధం ఉంటుంది. అలంటి సిమి ఉగ్రవాదులను పట్టుకోవడమే పోలీసులకు చాలా పెద్ద కసరత్తు. అలంటి సిమి ఉగ్రవాదులు ఏకంగా 8 మంది జైలు నుంచి తప్పించుకోవడంతో ఎలాంటి విపరీతాలు చోటు చేసుకుంటాయోనని పలువురు అనుమానిస్తున్నారు.