YSRCP : వైసీపీలోకి త్వరలోనే కీలక నేత.. ఆ కుటుంబానికి జగన్ బంపర్ ఆఫర్
వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. పార్లమెంటు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. మాగుంట కుటుంబానికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటికే సిద్ధమవుతున్న జగన్ ప్రధానంగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంపై కూడా ఫోకస్ పెట్టారంటున్నారు. ఒంగోలు ను పక్కన పెడితే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు స్థానానికి పోటీ చేయడానికి సరైన అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని ఫిక్సయినట్లు పార్టీలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డిని నెల్లూరు పార్లమెంటు నుంచి పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీలో విస్తృత ప్రచారం జరుగుతుంది.
వేమిరెడ్డిని తట్టుకోవాలంటే...
నెల్లూరు పార్లమెంటులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తట్టుకుని నిలబడే అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని మాత్రమేనని జగన్ భావిస్తున్నారు. మాగుంట కుటుంబానిని స్వస్థలం నెల్లూరు జిల్లానే కావడంతో ఈసారి ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేయించాలని దాదాపుగా సిద్ధమయినట్లు తెలుస్తోంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి వృద్ధాప్యంలోకి వెళ్లడంతో మాగుంట ప్రత్యామ్నాయం అని జగన్ భావిస్తున్నారు. మాగుంట అయితేనే ఖచ్చితంగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకునే అవకాశముంటుందన్న నివేదికలతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఇప్పటికే ప్రకటించిన మాగుంటతో...
మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇప్పటికే తాను రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుని తన వారసుడు, కుమారుడు రాఘవరెడ్డిని రాజకీయాల్లోకి దింపుతాననిఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత జగన్ మాగుంట కుటుంబానికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు చర్చ జరుగుతుంది. మాగుంట శ్రీనివాసులురెడ్డికి నెల్లూరు పార్లమెంటు స్థానం, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి మార్కాపురం టిక్కెట్ ను ఇచ్చేందుకు జగన్ సుముఖతగా ఉన్నారని మధ్యవర్తి ద్వారా సమాచారం పంపారని తెలిసింది. మాగుంట కుటుంబం తరచూ పార్టీలు మారే చరిత్ర ఉంది. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా ఎమ్మెల్సీ అయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి ఎంపీ అయ్యారు. 2024లో తిరిగి ఒంగోలు ఎంపీ అయ్యారు. ఈసారి 2029 ఎన్నికల్లో మాగుంట నెల్లూరు నుంచి పోటీ చేస్తారన్న టాక్ బలంగా వినపడుతుంది. మాగుంట కుటుంబం కూడా ఇందుకు సుముఖంగా, అందులోనూ రాఘవరెడ్డి వైసీపీలోకి వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.