వెంకయ్యకు వామపక్షాల డైరక్ట్ సవాల్

Update: 2016-09-26 12:11 GMT

రాష్ట్రానికి హోదా కాకుండా ప్యాకేజీ మాత్రమే దక్కిన తర్వాత.. అదే అన్నిటికంటె గొప్ప విషయం అంటూ వెంకయ్యనాయుడు చాన్సు దొరికిన ప్రతి చోటా బీభత్సంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆయన వామపక్షాలు హోదా గురించి నిర్వహించిన ప్రత్యేక ప్రజా బ్యాలెట్ ను కూడా గేలి చేశారు. జనం స్పందన లేదంటూ, జనం ప్యాకేజీని ఆమోదించారని.. వెంకయ్యనాయుడు అన్నారు.

అయితే ఈ విషయం మీదనే వామపక్షాల నాయకులు ఆయనకు సవాళ్లు విసురుతున్నారు. వెంకయ్య తన మాటల్ని తానే గనుక నిజంగా నమ్ముతున్నట్లయితే.. ఏపీలో ఉన్న భాజపాకు చెందిన ఆరుగురు ప్రజాప్రతినిదులతో రాజీనామా చేయించి మళ్లీ బరిలోకి దింపాలనేది ఆ సవాలు. వారు గనుక మళ్లీ గెలిస్తే.. తాము ముక్కు నేలకు రాస్తాం అని వామపక్ష నేతలు పేర్కొంటుండడం విశేషం.

సీపీఐ నేత నారాయణ , తన దైన శైలిలో వెంకయ్యనాయుడును తూర్పార పడుతున్నారు గానీ.. అతిశయం జోడించిన ఆ విమర్శల కంటె.. ఈ సవాళ్లు కాస్త పరిగణించగలిగేవిలా ఉన్నాయి. అయినా.. నాయకులు అందుకు సిద్ధంగా ఉంటారా? ఎప్పటిలాగే కేవలం సవాళ్లకు మాత్రమే పరిమితం అవుతారా? అనేది చూడాలి.

Similar News