Tirumala : తిరుమలకు నేడు వెళుతున్న వారికి హై అలెర్ట్

తిరుమలకు నేడు భక్తులు పోటెత్తారు

Update: 2025-12-30 03:14 GMT

తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వార దర్శనం కావడంతో ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు నిన్న రాత్రి భక్తులు తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్లను ముందుగానే ఆన్ లైన్ లో భక్తులకు కేటాయించారు. వారికి మాత్రమే నేడు తిరుమలలో దర్శనానికి అనుమతిఇస్తున్నారు. తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతాయి. ఎవరికి కేటాయించిన సమయంలో వారు క్యూ లైన్ వద్దకు చేరుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల సూచిస్తున్నారు.

వీఐపీల తాకిడితో...
మరొకవైపు తిరుమలకు వీఐపీల తాకిడి కూడా పెరిగింది.తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ( తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, నారా రోహిత్ తదితరులు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చారు. వారికి ఆలయ పండితులు తీర్థ ప్రసాదాలను అందచేశారు.
సర్వదర్శనాలను రద్దు చేసి...
ఈరోజు తిరుమలలో సర్వదర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. కేవలం వైకుంఠ ద్వార దర్శనాలకు మాత్రమే అనుమతిస్తారు. ఎలాంటి ప్రత్యేక దర్శనాలను అనుమతించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 59,631 మంది భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 18,609 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కుల చెల్లించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.36 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News