Hyderabad : బంగారమే ప్రాణం తీసింది... వృద్ధురాలిని హత్య చేసిన యువకుడు

హైదరాబాద్‌ నాచారంలో దారుణం జరిగింది. ఇంటి యజమానిని ముగ్గురు యువకులు హత్య చేశారు

Update: 2025-12-30 05:37 GMT

హైదరాబాద్‌ నాచారంలో దారుణం జరిగింది. ఇంటి యజమానిని ముగ్గురు యువకులు హత్య చేశారు. అద్దెకు దిగిన వారు యజమాని ఇంటి కాలయముళ్లుగా మారారు. బంగారం కోసం ఇంటి యజమాని సుజాతను చంపిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త, కుమారుడు మరణించడంతో సుజాత అనే మహిళ ఒంటరిగా ఉంటుంది. అరవై అయిదేళ్ల మహిళ ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తుంది. కొన్నాళ్ల క్రితం కోనసీమజిల్లాకు చెందిన అంజిబాబు సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. అంజిబాబు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. రెండు నెలల క్రితమే ఇంట్లోకి అద్దెకు వచ్చిన అంజిబాబు ఒంటరిగా ఉంటున్న సుజాత వద్ద నగలు ఉన్నాయని గమనించాడు. నగదు ఉందని చూసి వాటిని కాజేయడానికి స్కెచ్ వేశాడు.

నగలు, డబ్బులు కోసం...
నగలు, డబ్బులను కాజేసి తాను దూరంగావెళ్లిపోయి జీవితంలో సెటిల్అవ్వాలని నిర్ణయించుకున్న అంజిబాబు అందుకు అనుగుణంగా పథకాలను రచించాడు. అయితే ఈ నెల 19వ రాత్రి సుజాతను గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ఆమె శరీరంపై ఉన్న పదకొండు తులాల బంగారాన్ని తసీుకున్నాడు. మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేసి ఇంటికి తాళంవేసి పారిపోయాడు. అయితే తాను హత్యచేసిన విషయాన్ని తన స్నేహితులైన యువరాజు, దుర్గారావులకు తెలిపారు. ఈ 20వ తేదీన ముగ్గురు కారును అద్దెకు తీసుకుని మల్లాపూర్ లో ఉన్న సుజాత మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి గోదావరి నదిలో పడేశారు. కోనసీమ జిల్లాలోని కృష్ణలంకలోని గోదావరి నదిలో మృతదేహాన్ని పడేసి ఏమీ తెలియనట్లు వ్యవహరించారు.
పోలీసుల విచారణలో...
అయితే సుజాత నుంచి సమాచారం తెలియకపోవడంతో ఆమె సుజాత ఈ నెల 24వ తేదీన ఇంటికి వచ్చి చూశారు. సుజాత కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సుజాత కనిపించకపోవడం, ఇంట్లో అద్దెకు ఉంటున్న అంజిబాబు కూడా కనిపించకపోవడంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యచేసిన విషయాన్ని చెప్పారు. మృతదేహాన్ని ఎక్కడ పడేసిందీ తెలిపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గుని అరెస్ట్ చేసిన అనంతరం న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. దీంతో రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.

































Tags:    

Similar News