Gold Price Today : బంగారం కొనాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు పతనమయ్యాయి

Update: 2025-12-30 03:28 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయి. వెండి ధరలు కూడా కొండెక్కుతాయి. కానీ వెండి ధరలు కొంత తగ్గుతున్నప్పటికీ మళ్లీ కొత్త ఏడాది ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు పెరగడం ఇటీవల కాలంలో కామన్ గా మారింది. ప్రతి రోజూ ధరలు పెరుగుతుండటమే అందరూ వినాల్సి వస్తుంది. ఎంత పెరిగాయన్న విషయం పక్కన పెడితే ఎంతో కొంత పెరగడం అది కొనుగోలు చేసేవారికి భారంగా మారనుందని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే బంగారం బరువెక్కింది. వెండి ముట్టుకుంటే మాడిపోతుంది. ఈ సమయంలో బంగారం, వెండి ధరలను కొనుగోలు చేయడం సామాన్యులకు సాధ్యం కాని విషయం.

పెరగడమే తప్ప...
మరొకవైపు మధ్యతరగతి ప్రజలు, వేతనజీవులు కూడా బంగారానికి, వెండికి దూరమయ్యారు. గతంలో ఎన్నడూ ఇంతలా పెరగలేదని, ఈ ఏడాది ఇంతలా బంగారం, వెండి భయపెడుతున్నాయని, కొత్త ఏడాది అయినా ధరలు తమకు అందుబాటులోకి వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. మరొకవైపు చాలా మంది ఫంక్షన్లకు, ఇతర వేడుకలకు బంగారాన్ని వినియోగించడం మానుకున్నారు. బంగారం, వెండి స్థానంలో ప్రత్యామ్నాయాలను ఎంచుకున్నారు. అందులో భాగంగా రోల్డ్ గోల్డ్ నగలను ఎక్కవగా కొనుగోలు చేస్తున్నారు. ఇంకొందరు వన్ గ్రామ్ గోల్డ్ ను కొనుగోలు చేసి ఉన్నదాంట్లో సంతృప్తి పడుతున్నారు. ఇలా అనేక మంది బంగారం, వెండి విషయంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ కోర్కెలను తీర్చుకుంటున్నారు.
కొత్త ఏడాదిలోనూ...
వెండి ధరలు పెరుగుతాయని అందులో పెట్టుబడి పెట్టేవారికి నిన్న ఒక్కరోజే కిలో వెండి ధరపై ఇరవై ఒక్క రూపాయలు తగ్గింది. దీంతో బంగారం, వెండి ధరలపై పెట్టుబడి పెట్టేందుకు కూడా చాలా మంది ముందుకు రావడం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు పతనమయ్యాయి. పది గ్రాముల బంగారం ధర పై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగరాం ధర 1,27,240 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,39,240 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 2,80,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండే అవకాశాలున్నాయి.








Tags:    

Similar News