ఇస్రో శాస్త్ర వేత్తలు మరో అడుగు ముందుకు వేశారు. మొదటిసారి బహుళ కక్ష్య లలోకి ఉపగ్రహాలని ప్రవేశపెట్టి ప్రపంచం దృష్టి తమ మీద పడేలా చేసుకున్నారు. ఇప్పటికే ఎన్నో ప్రయోగాలను విజయవంతం గా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పుడు మరో ఘన కీర్తిని సొంతం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా లోని షార్ నుంచి ఉదయం 9:12 గంటలకు ఈ వాహక నౌకను ప్రయోగించారు. వీరు ప్రయోగించిన పి ఎస్ ఎల్ వి – సి 35 రాకెట్ విజయవంతంగా కక్షలోనికి ప్రవేశపెట్టబడి తమ పనిని విజయవంతం గా పూర్తిచేసి శభాష్ అనిపించుకున్నారు.
ఇది 2.30 గంటల వ్యవధిలో రెండు వేర్వేరు కక్ష్యలలో ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టగలిగింది. ఇక ఈ ప్రయోగం విజయవంతం కావడం తో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వీరి విజయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ ఉపగ్రహాలూ సునామీలు, తుఫాన్లు, గాలి వేగం వంటి కీలక వాతావరణ మార్పులకు సంభందించిన సమాచారాన్ని అందించనున్నాయట. ఇక ఈ విజయం తో ప్రపంచ దృష్టి ని ఆకర్షించి ఇస్రో మరో మెట్టెక్కిందనే చెప్పాలి.