పోలవరం నిధుల కరవు లేదు : నాబార్డ్‌ పచ్చజెండా!

Update: 2016-09-26 12:38 GMT

జాతీయ ప్రాజెక్టు పోలవరం ను 2018 నాటికి పూర్తి చేయాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అమరావతి రాజధాని తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అత్యధిక శ్రద్ధను పోలవరం మీదనే పెడుతున్నారు. అలాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిదుల కరవు తీరబోతోంది. దీనికి అవసరమైన నిధులను నాబార్డ్‌ రుణంగా ఇవ్వడానికి సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరింది. నాబార్డ్‌ ఇచ్చే రుణాన్ని, తిరిగి కేంద్ర ప్రభుత్వం చెల్లింపులు చేసేస్తుంది.

సోమవారం నాడు సుజనా చౌదరి కార్యాలయంలో నాబార్డ్‌ అధికారులతో చర్చలు జరిగాయి. ఇందులో నిధులు రుణంగా ఇవ్వడానికి నాబార్డ్‌ పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తోంది. అక్టోబరు నుంచి నాబార్డు నుంచి దశల వారీగా అవసరమైన నిధులు అందుతాయనేది ప్రస్తుతానికి తెలుస్తున్న సమాచారం.

నిధుల కొరత తీరడంతో ఇకమీదట పోలవరం పనులు బాగా వేగం పుంజుకుంటాయని.. అనుకున్న లక్ష్యగడువులోగా పనులు పూర్తిచేయడానికి చంద్రబాబునాయుడు సర్కారు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతుందని ప్రజలు భావిస్తున్నారు.

Similar News