పవన్ ను తిట్టినందుకు...!

Update: 2017-12-14 08:40 GMT

గుంటూరుకు చెందిన జగన్ అభిమాని వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యారు. జగన్ ను ఏమైనా అంటే చంపేస్తామని, జగన్ కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధమని వెంకటరెడ్డి వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఏమైనా అంటే ఊరుకోనని హెచ్చరించారు. జగనన్న కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధమని వీడియోలో చెప్పారు. కాగా వెంకటరెడ్డి రెండు హత్య కేసుల్లో నిందితుడని పోలీసులు చెబుతున్నారు. వెంకటరెడ్డిని నల్లబాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై రౌడీషీట్ తెరవనున్నట్లు పోలీసులు చెప్పారు. వెంకటరెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Similar News