జగన్ త్వరలో జైలుకెళ్ళబోతున్నాడట. ఇలా జోశ్యం చెప్పింది ఎవరో కాదు ఏపీ ఉప ముఖ్యమంత్రి అయిన కె.ఈ కృష్ణ మూర్తిగారు. జగన్ ఇప్పటికే ఎన్నో కేసుల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాడని ఇక వాటినుండి బయట పడటం జగన్ వల్ల అయ్యే పని కాదని అంటున్నాడు. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి ని అడ్డం పెట్టుకుని చాలా ఆస్తులను.... అంటే లెక్కకు మించి ఆస్తులను కూడబెట్టి వాటికి లెక్కలు చెప్పకుండా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి రాష్ట్రాన్ని అడ్డం గా దోచుకుని తిన్నాడని అందుకే వచ్చే ఎన్నికలకల్లా జగన్ ఖచ్చితం గా జైలు కెళతాడని కృష్ణమూర్తి చెబుతున్నాడు. ఇక జైలు కెళతానన్న భయం తోనే జగన్ కేంద్ర ప్రభుత్వం పై, బిజెపి నేతలపై విమర్శలు చెయ్యలేక సతమవుతున్నాడని ఎద్దేవా చేశారు.
ఇంకా అయన మాట్లాడుతూ రాష్ట్రం లో తల్లి కాంగ్రెస్ పని అయిపొయింది.... ఇక మిగిలింది పిల్ల కాంగ్రెస్ వైసీపీ అది కూడా వచ్చే ఎన్నికల్లో తుడిచి పెట్టుకుని పోతుందని అంటున్నారు. అసలు కాంగ్రెస్ వాళ్ళు అధికారం లో ఉన్నప్పుడు చేసిన అవినీతి పనులు, రాష్ట్రాన్ని అడ్డ దిడ్డలుగా విభజించి ఏపీని అన్యాయం చేశారు. పోనీ ఏపీని ఒకటే అన్యాయం చేసి తెలంగాణ లో కాంగ్రెస్ పాముకున్నదేమి లేదని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలపై విరుచుకు పడ్డారు. ఇంకా జగన్ చేసిన పాపం జగన్ ని ఎప్పటికైనా వదిలిపెట్టదని ఆ పాపానికి తగిన శిక్ష అనిభావించి తీరాలని చెప్పుకొచ్చాడు. అసలు చంద్రబాబు వల్లే ఏపీ కొంతలో కొంత అభివృద్ధి చెందిందని లేకుంటే అది కూడా సాధ్యమయ్యేది కాదని జగన్ వల్ల అస్సలు ఏపీని బాగుచెయ్యడం కుదిరే పని కాదని అన్నారు. జగన్ గనక ముఖ్యమంతి అయితే ఈపాటికి రాష్ట్రాన్ని సగం దోచేసేవాడని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు కృష్ణ మూర్తి.
మరి కృష్ణమూర్తి వ్యాఖ్యలకు జగన్ ఏం కౌంటర్ ఇవ్వకుండా ఊరుకుంటాడా లేక త్వరలోనే కృష్ణమూర్తికి తగిన జవాబు ఇస్తాడా... అనేది చూడాలి.