గుజరాత్ లో ఇలా జరిగితే...?

Update: 2017-12-14 12:49 GMT

గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ లో ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ 78 నుంచి 86 స్థానాలు, బీజేపీకి 91 నుంచి 99 నుంచి స్థానాలు, ఇతరులకు 8 నుంచి 7 స్థానాలు లభిస్తాయి. సీఎస్ఎన్ ఐబీఎన్ బీజేపీ 109, కాంగ్రెస్ 70, ఇతరులు మూడు స్థానాల్లో గెలుస్తారని చెప్పింది. టైమ్స్ నై వీఎంఆర్ సర్వే ప్రకారం బీజేపీకి 109 స్థానాలు, కాంగ్రెస్ కు 70 స్థానాలు ఇతరులకు మూడు స్థానాలు లభిస్తాయి. సీవోటర్ సర్వే ప్రకారం బీజీపీ 108 కాంగ్రెస్ 70 స్థానాలు లభిస్తాయి. అయితే గతంలో కంటే గుజరాత్ లో బీజేపీ హవా తగ్గిందన్నది ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం స్పష్టమైంది. కాంగ్రెస్ కొంతమేర బలం పుంజుకోగలిగిందని కూడా అన్ని సర్వే సంస్థల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే గతంలో జరిగిన ఎగ్జిట్ పోల్స్ లో అంచనాలకు మించి బీజేపీ సీట్లను కైవసం చేసుకుంది. దీన్నే బీజేపీ నేతలు ఉదహరిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కంటే భిన్నంగా తాము 150 సీట్లకు పైగానే సాధించుకుంటామని బీజేపీ చెబుతుండగా, అండర్ కరెంట్ పనిచేసి తాము ఈసారి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Similar News