కొత్తగా ఒక ఎన్ కౌంటర్ : మొందర్ సెక్టార్ లో బీభత్సం

Update: 2016-09-29 11:12 GMT

భారత్ దాడులకు సమాధానం అన్నట్లుగా పాకిస్తాన్ మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఉద్రిక్త సమయంలోనే మరింత మంది తీవ్రవాదులను భారత్ లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని మొందార్ సెక్టార్ లో ఉగ్రవాదులు చొరబడడానికి ప్రయత్నించగా.. భారత సైన్యం తిప్పి కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

భారత సైన్యం చాలా వేగంగా ప్రతిస్పందించడంతో.. దానిని ఊహించని ఉగ్రవాదులు సమీపంలోని అడవిలో దాక్కున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. భారత సైన్యం వారిని చుట్టుముట్టి ఎన్ కౌంటర్ సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్నిచోట్ల ఉగ్రవాదులను భారత్ లోకి చొరబడేలా ప్రవేశ పెట్టడం ద్వారా ముందు భారత సైన్యాన్ని గందరగోళానికి గురిచేసి, ఆ తర్వాత, సైనిక దాడుల ద్వారా షాక్ ఇవ్వాలనేది పాకిస్తాన్ వ్యూహంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే పాకిస్తాన్ ఏ రూపంలో స్పందించినా సరే.. ఎదుర్కొనడానికి తాము సిద్దంగా ఉన్నాం అంటూ భారత సైనికాధికారులు ప్రకటిస్తూ ఉండడం విశేషం.

Similar News