బ్రేకింగ్ : వైసీపీ సీనియర్ నేత కన్నుమూత
వైసీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు మృతి చెందారు. సాంబశివరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను విశాఖలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ [more]
వైసీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు మృతి చెందారు. సాంబశివరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను విశాఖలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ [more]
వైసీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు మృతి చెందారు. సాంబశివరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను విశాఖలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన కొద్దిసేపటి క్రితం మరణించారు. పెనుమత్స సాంబశివరాజు ఎనిమిది సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. రెండు సార్లు మంత్రి పదవిని అలంకరించారు. విజయనగరం జిల్లాలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు సాంబశివరాజు రాజకీయ గురువు. ఆయన మరణంతో విజయనగరం జిల్లాలో వైసీపీ ఒక పట్టున్న నేతను కోల్పోయింది.