Bellary : బళ్లారిలో భయం.. భయం.. కాల్పులు.. ఒకరి మృతి

బళ్లారిలో ఘర్షణలు తలెత్తాయి. కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు.

Update: 2026-01-02 03:00 GMT

బళ్లారిలో ఘర్షణలు తలెత్తాయి. కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఈ సందర్భంగా కాల్పులు జరిగాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ చేయి దాటి పోవడంతో ప్రజాప్రతినిధుల భద్రతా సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపారు. అయితే గన్ మెన్ చేతిలో గన్ లాక్కుని ఒక వ్యక్తి కాల్పులు జరపడంతో రాజశేఖర్ అనే వ్యక్తమ మరణించాడు. దీంతో బళ్లారిలో ఉద్రిక్తత తలెత్తింది. బ్యానర్ల తొలగింపు విషయంపైనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. దీంతో బళ్లారి నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

బ్యానర్లు కట్టే విషయంలో...
కాల్పుల ఘటనలో రాజశేఖర్ అనే వ్యక్తి మరణించాడు. వాల్మీకి విగ్రహ ప్రతిష్ట విషయంలో ఈ ఘర్షణ తలెత్తినట్లు సమాచారం. వాల్మీకి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఒక వర్గం బ్యానర్లను కట్టేందుకు ప్రయత్నించడం, మరొక వర్గం బ్యానర్లను తొలగించే ప్రయత్నం చేసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లదాడికి దిగారు. రాళ్లు, సీసాలతో దాడి చేసుకోవడంతో పరిస్థితి చేయిదాటి పోతుందని గ్రహించి గన్ మెన్లు గాల్లోకి కాల్పులు జరపారు. ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఘటన స్థలికి చేరుకోవడంతో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
గాలి, నారా వర్గీయుల మధ్య...
అయితే ఇదే సమయంలో గాలి జనార్ధన్ రెడ్డి మీదకు ఒక వ్యక్తి గన్ మెన్ చేతిలో ఉన్న గన్ ను లాక్కుని కాల్పులు జరపడంతో అది గురితప్పి రాజశేఖర్ అనే వ్యక్తికి తగిలింది. దీంతో అతను మరణించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి వర్గీయుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. బ్యానర్ల విషయంలోనే ఈ ఘర్షణ జరిగి అది చివరకు కాల్పులకు దారితీసిందని తెలిపారు. సతీష్ రెడ్డి భద్రతాసిబ్బంది కాల్పులు జరిపారని, రాజకీయ దురుద్దేశ్యంతోనే ఘర్షణలకు కారణమయ్యారని ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు బళ్లారి పట్టణంలో 144వ సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News