Tirumala : తిరుమలకు నేడు వెళ్లే భక్తులు.. ఎన్ని గంటలు వెయిట్ చేయాలంటే?

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

Update: 2026-01-02 03:32 GMT

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సప్తగిరులు జనసంద్రంగా మారాయి. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు నుంచి టోకెన్లు లేకపోయినా భక్తులను వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు వేల సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చారు. గత నెల 30వ తేదీన ప్రారంభమయిన వైకుంఠ ద్వార దర్శనాలను మూడు రోజుల పాటు అంటే జనవరి ఒకటో తేదీ వరకూ టోకెన్ల ద్వారానే భక్తులకు అనుమతించారు. నేటి నుంచి టోకెన్లు లేకుండా భక్తులను అనుమతిస్తున్నారు.

టోకెన్లు లేకుండా...
టోకెన్లు లేకుండా దర్శనానికి అనుమతిస్తుండటంతో తెలంగాణ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. అలిపిరి టోల్ గేట్ నుంచి రద్దీ కనిపిస్తుంది. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీకే ఎక్కువ సమయం పడుతుంది. కొండ మీదకు వచ్చిన వారు నేరుగా సర్వవర్శనం క్యూ లైన్ లోకి ప్రవేశిస్తున్నారు. అలాగే నేటి నుంచి ప్రత్యేక దర్శనాలకు కూడా అనుమతిస్తుండటంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. అయితే భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
బయట వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,225 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,106 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.















Tags:    

Similar News