Gold Price Today : గుడ్ న్యూస్ అనలేం కానీ.. పసిడిప్రియులకు ఒకరకంగా తీపికబురే
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
బంగారం ధరలు మరింతగా పెరుగుతాయి. ఇది అందరూ ఆందోళన చెందే విషయమే. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పరుగులు పెడుతుండటంతో కొత్త ఏడాది అయినా ధరలు దిగివస్తాయేమోనని చాలా మంది భావించారు. కానీ బంగారం విషయంలో మాత్రం అది నిజం కావడం లేదు. కాస్త వెండి ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా వెండి కొనుగోలు చేయాలంటే మధ్యతరగతి ప్రజలు అందుబాటులోకి రాలేదు. బంగారం, వెండి ధరలు ఇంతగా పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతున్నాయి.
సెంటిమెంట్ గా మారి...
బంగారం, వెండి భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయాయి. ఈ రెండు వస్తువులు సెంటిమెంట్ గా మారింది. అదే సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఒక్క బంగారం, వెండి విషయంలోనే చూస్తుంటాం. గత ఏడాది బంగారం, వెండి ధరల పెరుగుదల అస్సలు ఆగలేదు. గత ఏడాది బంగారం ప్రియులకు చుక్కలు చూపించింది. మామూలుగా ధరలు పెరగలేదు. ధరల పెరుగుదలతో కొనుగోళ్లు గత ఏడాది భారీగా పడిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మకాలు దారుణంగా పడిపోయాయని వ్యాపారులు లబోదిబో మంటున్నారు. మరికొన్ని రోజుల పాటు బంగారం ర్యాలీ కొనసాగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
నేటి ధరలివీ...
ప్రస్తుతం పెట్టుబడి పెట్టేవారు సయితం బంగారం, వెండి విషయంలో వెనక్కుతగ్గుతున్నారు. నిన్నటి వరకూ పెట్టుబడి పెట్టిన వారు ఒక్కసారిగా వెండి ధరలు పతనం కావడంతో కొంత పెట్టుబడి పెట్టేందుకు జంకుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,23,810 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,35,070 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,55,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులుండవచ్చు.