జగన్ మరో నిర్ణయం .. వరద బాధిత కుటుంబాలకు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంపు బాధిత కుటుంబానికి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు అందజేయాలని జగన్ ఆదేశించారు. వెంటనే సహాయక చర్యలు [more]

Update: 2020-08-18 07:35 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంపు బాధిత కుటుంబానికి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు అందజేయాలని జగన్ ఆదేశించారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని కోరారు. నిత్యావసర వస్తువుల పంపిణీని వెంటనే చేయాలన్నారు. ముంపు బాధితుల పట్ల ఉదారంగా, మానవత్వంతో వ్యవహరించాలని జగన్ సూచించారు. మన ఇంట్లో వ్యక్తులకు కష్టం వచ్చినట్లుగానే భావించాలన్నారు. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే పదిరోజుల్లో వరద నష్టం అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి పంపాలని జగన్ ఆదేశిచారు. వరదసహాయక చర్యలపై జగన్ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Tags:    

Similar News

.