బ్రేకింగ్ : మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి యాభై లక్షలు

విజయవాడ కోవిడ్ ఆసుపత్రి లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ యాభై లక్షల పరిహారం ప్రకటించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని [more]

Update: 2020-08-09 04:20 GMT

విజయవాడ కోవిడ్ ఆసుపత్రి లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ యాభై లక్షల పరిహారం ప్రకటించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ఇప్పటి వరకూ అగ్ని ప్రమాద ఘటనలో తొమ్మిది మంది మరణించారు. దీనిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. ప్రయివేటు ఆసుపత్రి ఇక్కడ కోవిడ్ పేషెంట్లను ఉంచింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు కోలుకోవాలన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాద ఘటనలో మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని చంద్రబాబు కోరారు.

Tags:    

Similar News