సుప్రీంలో సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నా
తెలుగుదేశం పార్టీ వల్లనే పేదలకు రాష్ట్రంలో ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇళ్ల స్థలాలను పేదలకు పంచాలని [more]
తెలుగుదేశం పార్టీ వల్లనే పేదలకు రాష్ట్రంలో ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇళ్ల స్థలాలను పేదలకు పంచాలని [more]
తెలుగుదేశం పార్టీ వల్లనే పేదలకు రాష్ట్రంలో ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇళ్ల స్థలాలను పేదలకు పంచాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే టీడీపీ న్యాయస్థానాల ద్వారా అడ్డుకోవాలని చూస్తుందన్నారు. కరోనా కారణంగా కేసులు త్వరగా విచారణకు రాకపోవడం వల్లనే ఇళ్ల స్థలాల పంపిణీని వాయిదా వేశామన్నారు. ిటీడీపీ కోర్టుకు వెళ్లడం దురదృష్టకరమన్నారు జగన్. డీ పట్టాలు అయితే ఎప్పుడైనా ఇవ్వవచ్చని, అయితే మహిళలకు సంపూర్ణ హక్కులతో ఇవ్వాలనే వాయిదా వేశామని జగన్ చెప్పారు. సుప్రీంకోర్టులో దీనిపై సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు జగన్ తెలిపారు. జగన్ జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ వ్యాఖ్యలు చేశారు.