Weather Report : ఏపీ, తెలంగాణలలో వాతావరణం నేడు ఎలా ఉంటుందంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత పూర్తిగా తగ్గలేదు

Update: 2026-02-05 03:56 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత పూర్తిగా తగ్గలేదు. ఇంకా కొన్ని చోట్ల చలి గాలులు వీస్తున్నాయి. అయితే పగటి సమయంలో మాత్రం ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. పొగమంచు కూడా ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఎండల తీవ్రత రానున్న కాలంలో మరింత ఎక్కువయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, భానుడి ప్రతాపాన్ని తట్టుకునేది ఈ ఏడాది కష్టమేనన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మారుతున్న వాతావరణ ప్రభావంతో వానలు, తుపానులు, ఎండలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పింది.

పొడి వాతావరణం...
ఆంధ్రప్రదేశ్ లో పొడి వాతావరణం నేడు నెలకొని ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పొగమంచు పడే అవకాశముందని చెప్పింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో గరిష్ట వాతావరణం నెలకొంది. ఇక రాయలసీమలోనూ వాతావరణం వేడెక్కింది. కోస్తాంధ్ర జిల్లాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే ఉక్కపోత వాతావరణం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. తీర ప్రాంతాల్లో ఉక్కపోతతో ప్రజలు అలమటించిపోతున్నారు.
తెలంగాణలోనూ చలి తీవ్రత...
తెలంగాణలోనూ చలిగాలుల తీవ్రత పూర్తిగా తగ్గలేదు. ఉదయం, తెల్లవారు జామున మాత్రం చలి తీవ్రత కొంత ఎక్కువగా ఉంది. అయితే వణికిపోయే చలి లేదు కానీ, చలిగాలులు మాత్రం ఇంకా తగ్గలేదు. అలాగే పగటి పూట ఉష్ణోగ్రతలు కొంత ఎక్కువగానే కనపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ముప్ఫయి డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం ఇంకా ఎక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. రానున్న కాలంలో మరింత ఎండలు ఉండే అవకాశముందని, వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.


Tags:    

Similar News