అప్రమత్తయిన జగన్… అధికారులకు ఆదేశాలు.. అక్కడ?

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు. జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్సీలతో కరోనా పై సమీక్ష [more]

Update: 2020-04-14 07:13 GMT

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు. జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్సీలతో కరోనా పై సమీక్ష నిర్వహించారు. ఏపీలో మొత్తం 473 కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. ప్రధానంగా ఏపీలో రెడ్ జోన్ లుగా ప్రకటించిన ప్రాంతాల్లో అమలుపై జగన్ ప్రధానంగా చర్చించారు. కాంటాక్టు కేసులు పెరగకుండా చూసుకోవాలని జగన్ కోరారు. మరోవైపు నిత్యావసర వస్తువల కొరత ఎక్కడా ఉండకూడదని, ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. అత్యధికంగా గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు.

Tags:    

Similar News