LPG Gas : గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు.. జాగ్రత్తగా లేకపోతే అంతే
గ్యాస్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సరికొత్త సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు
గ్యాస్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సరికొత్త సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందనే అపోహలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యంగా ఆన్‌లైన్‌లో గ్యాస్ బుకింగ్ కోసం వెతికే వారినే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నార. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామని, అదనపు సిలిండర్లు కేటాయిస్తామని సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా నకిలీ వెబ్‌సైట్ లింకులు పంపిస్తూ ముందుగా డబ్బులు చెల్లిస్తే వెంటనే గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారు.
పోలీసులకు ప్రజలకు సూచనలివే...
అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.
గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం కేవలం అధికారిక గ్యాస్ కంపెనీల వెబ్‌సైట్లు లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే సంప్రదించాలి
గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ ఖాతా వివరాలు, OTP, UPI పిన్ వంటి గోప్యమైన సమాచారాన్ని ఇవ్వకూడదు.
నకిలీ వెబ్‌సైట్లలో వ్యక్తిగత వివరాలు నమోదు చేయడం వల్ల బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది.
సైబర్ మోసాలకు గురైతే :
ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ కాల్ చేయాలి