వారికి నేడు టార్గెట్ విధించనున్న జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని జగన్ పరిశీలించనున్నారు. ఏరియల్ సర్వే ద్వారా జగన్ [more]

Update: 2020-02-28 02:04 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని జగన్ పరిశీలించనున్నారు. ఏరియల్ సర్వే ద్వారా జగన్ పోలవరం ప్రాజెక్టు పనుల జరుగుతున్న తీరును పరిశీలిస్తారు. ఇప్పటికే 69 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.మెగా ఇంజినీరింగ్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించిన తర్వాత పనుల్లో వేగం పెరిగిందంటున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం పనులను పరిశీలించేందుకు స్వయంగా జగన్ వెళుతున్నారు. అక్కడ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత పనుల పురోగతిపై అధికారులతో జగన్ సమీక్షించనున్నారు. ప్రాజెక్టు పనులకు జగన్ కాలపరిమితితో కూడిన టార్గెట్ విధించనున్నారు.

Tags:    

Similar News