నేడు జగన్ వారికి 693 కోట్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విద్యాదీవెన రెండో విడత కార్యక్రమానికి సంబంధించి నిధులను విడుదల చేయనున్నారు. ఏపీలో జగనన్న విద్యాదీవెన పథకాన్ని గత ఏడాది అమలు [more]

Update: 2021-07-29 02:46 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విద్యాదీవెన రెండో విడత కార్యక్రమానికి సంబంధించి నిధులను విడుదల చేయనున్నారు. ఏపీలో జగనన్న విద్యాదీవెన పథకాన్ని గత ఏడాది అమలు చేశారు. విద్యార్థులు తమ ఫీజులు చెల్లించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. రెండో విడత విద్యాదీవెన కింద 11 లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందనున్నారు. వీరి తల్లుల ఖాతాల్లో ఈరోజు జగన్ 693 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని జగన్ నిర్వహించనున్నారు.

Tags:    

Similar News