ప్రధాని మోదీకి జగన్ మరో లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరోసారి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ కు 60 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయాలని జగన్ తన [more]

Update: 2021-04-17 01:16 GMT

ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరోసారి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ కు 60 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయాలని జగన్ తన లేఖలో కోరారు. ఇప్పటికే తాము ఆరు లక్షల 28 వేల మందికి కోవిడ్ డోస్ లను వేశామని చెప్పారు. అయితే ఒకే రోజు డోసుల వేయడంతో కొరత ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఏపికి మరిన్ని డోసులను పంపాలని జగన్ మోదీని తన లేఖలో కోరారు. తాము రోజుకు ఆరు లక్షల మందికి డోసులు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని జగన్ తన లేఖలో కోరారు.

Tags:    

Similar News