గంటసేపు జగన్ సమావేశం.. వారు ఖుషీ
విశాఖ పట్నం ఎయిర్ పోర్టు కు చేరుకున్న జగన్ కార్మిక సంఘాల నేతలతో దాదాపు గంట సేపు సమావేశమయ్యారు. షెడ్యూల్ ప్రకారం పది నిమిషాలు మాత్రమే జగన్ [more]
విశాఖ పట్నం ఎయిర్ పోర్టు కు చేరుకున్న జగన్ కార్మిక సంఘాల నేతలతో దాదాపు గంట సేపు సమావేశమయ్యారు. షెడ్యూల్ ప్రకారం పది నిమిషాలు మాత్రమే జగన్ [more]
విశాఖ పట్నం ఎయిర్ పోర్టు కు చేరుకున్న జగన్ కార్మిక సంఘాల నేతలతో దాదాపు గంట సేపు సమావేశమయ్యారు. షెడ్యూల్ ప్రకారం పది నిమిషాలు మాత్రమే జగన్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో మట్లాడాల్సి ఉంది, వారిచ్చిన వినతిపత్రాలను స్వీకరించాల్సి ఉంది. అయితే కార్మిక సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ గంట సేపు సమావేశమై చర్చించడం కార్మికుల్లో ఆనందాన్ని నింపింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించడానికి కార్మిక సంఘాలు ఫోర్ పాయింట్ ఫార్ములాను సూచించాయి. కార్మిక సంఘాల సూచనలను శ్రద్ధతో విన్న జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడతానని వారికి హామీ ఇచ్చారు. గంట సేపు సీఎం సమావేశం కావడం తో కార్మిక సంఘలు ఖుషీ అయ్యాయి.