India vs New zealand : భారత్ పై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్
నాలుగో టీ20లో భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.
నాలుగో టీ20లో భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. భారత్‌పై 50 పరుగుల తేడాతో గెలిచింది. మూడు టీ20లు వరసగా ఓడిపోయిన న్యూజిలాండ్ ప్రతీకారాన్ని తీర్చుకుంది. సిరీస్ లో న్యూజిలాండ్ తొలి విజయం సాధించింది. ఎట్టకేలకు న్యూజిలాండ్ జట్టు సమిష్టి ఆట చూపించింది. బ్యాట్, బాల్ రెండు విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసిన కివీస్, భారత్‌తో జరిగిన నాలుగో టీ20లో 50 పరుగుల తేడాతో గెలిచింది. బుధవారం రాత్రి విశాఖలో జరిగిన ఈ మ్యాచ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్ ఖాతా తెరిచింది. సిరీస్‌లో భారత్ ఆధిక్యం 3-1గా కొనసాగుతోంది.
వరసగా అవుట్ కావడంతో...
216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభం నుంచే తడబడింది. తొలి బంతికే అభిషేక్ శర్మ డక్ అవుటయ్యాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో డీప్‌లోకి స్లాష్ షాట్ ఆడగా నేరుగా ఫీల్డర్ చేతికి వెళ్లింది. వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఎనిమిది పరుగులకే జాకబ్ డఫీ బౌలింగ్‌లో తానే కొట్టిన బంతికే క్యాచ్ ఇచ్చాడు. రెండు ఓవర్లకే భారత్ స్కోరు 9 పరుగులకు రెండు వికెట్లుగాగా మారింది. ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి చెత్త ఫామ్ కొనసాగించాడు. 24పరుగులకే అవుటయ్యాడు. మిచెల్ సాంట్నర్ వేసిన ఎడమచేతి స్పిన్‌లో బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్లలో హార్దిక్ పాండ్యా రెండు పరుగులకే వెనుదిరిగాడు.
రింకూ, దూబే.. దూకుడుతో...
నాలుగో స్థానంలో వచ్చిన రింకూ సింగ్ నిలకడగా ఆడాడు. 30 బంతుల్లో 39 పరుగులు చేశాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. అయితే జాక్ ఫౌల్క్స్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ మిస్ కావడంతో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. అప్పటికి భారత్ 10.3 ఓవర్లలో 82 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. డ్యూ ప్రభావాన్ని కూడా లెక్కచేయకుండా న్యూజిలాండ్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. ఈ దశలో శివమ్ దూబే ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 23 బంతుల్లో 61 పరుగులు చేసి ఆశలు రేపాడు. 12వ ఓవర్లో ఇష్ సోధీ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 29 పరుగులు రాబట్టాడు. మ్యాచ్ మలుపు తిప్పుతాడనుకున్న దశలో దూబే దురదృష్టకర రన్‌అవుట్‌కు గురయ్యాడు. హర్షిత్ రాణా బ్యాక్‌డ్రైవ్ చేసిన బంతి హెన్రీ చేతికి తగిలి నేరుగా స్టంప్స్‌ను తాకింది.
కివీస్ బ్యాటింగ్ లోనూ...
ఆ తర్వాత కివీస్ మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించి భారత్‌ను 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో భారత బ్యాటింగ్ కూడా కొన్నిసార్లు బలహీనంగా మారుతుందనే విషయాన్ని న్యూజిలాండ్ గుర్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆరంభం నుంచే దూకుడు చూపింది. డెవాన్ కాన్వే (44) మరియు టిమ్ సీఫర్ట్ తొలి వికెట్‌కు 8.2 ఓవర్లలోనే 100 పరుగులు జత చేశారు. కాన్వే మధ్య ఓవర్లలో న్యూజిలాండ్ రన్‌రేట్ తగ్గింది. అయితే డారిల్ మిచెల్ (39 నాటౌట్; 18 బంతులు) చివర్లో దూకుడు చూపాడు. రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో జట్టును 20 ఓవర్లలో 215/7కు చేర్చాడు.216 లక్ష్యంతో బరిలోకి దిదగిన భారత్ 165 పరుగులకే ఆల్ అవుట్ అయింది.