బ్రేకింగ్ : కలియుగం క్లైమాక్స్ అంటే ఇదే.. జగన్ సెన్సేషన్ కామెంట్స్
దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆయన ఏపీ పోలీస్ మీట్ సందర్భంగా మాట్లాడారు. వరసగా జరుగుతున్న దేవాలయాలపై దాడుల విషయంపై జగన్ [more]
దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆయన ఏపీ పోలీస్ మీట్ సందర్భంగా మాట్లాడారు. వరసగా జరుగుతున్న దేవాలయాలపై దాడుల విషయంపై జగన్ [more]
దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆయన ఏపీ పోలీస్ మీట్ సందర్భంగా మాట్లాడారు. వరసగా జరుగుతున్న దేవాలయాలపై దాడుల విషయంపై జగన్ స్పందించారు. దేవుళ్ల జోలికి ఎవరు వెళతారని ప్రశ్నించారు. విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎవరికి లాభం? అని నిలదీశారు. తాము మంచిపనిని తలపెట్టినప్పుడల్లా ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్నారు. నాడు నేడు ప్రారంభించినప్పుడు కూడా గుంటూరులో గుడి ధ్వంసం అంటూ కొందరు రచ్చ చేశారు. దేవుడి విగ్రహాలతో రాజకీయ లబ్ది పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. కలియుగం క్లైమాక్స్ అంటే ఇదేనేమో అని జగన్ అన్నారు. దేవుడంటే భయం భక్తీ లేకుండా పోయిందన్నారు. తానుచేసే మంచి పనులకు పబ్లిసిటీ రాకూడదనే కొందరు ఈ ధ్వంసరచనకు పూనుకున్నారన్నారు.