సమస్య మళ్లీ మొదటికే

గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కు, ప్రభుత్వానికి మళ్లీ వార్ ప్రారంభమయింది.

Update: 2023-03-03 07:08 GMT

గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కు, ప్రభుత్వానికి మళ్లీ వార్ ప్రారంభమయింది. రాజ్‌భవన్ లో ప్రభుత్వానికి సంబంధించిన కీలక బిల్లులను ఆపేశారంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. బల్లులను క్లియర్ చేసే విధంగా ఆదేశాలివ్వాలంటూ ప్రభుత్వం తన పిటీషన్ లో కోరారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం జరగడంతో ఇక సమస్యకు తెరపడినట్లేనని అందరూ భావించారు.

బిల్లుల పెండింగ్‌‌తో...
ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తమిళిసై సౌందర్‌రాజన్ ను అసెంబ్లీ సమావేశాలకు స్వయంగా తీసుకెళ్లడం, తిరిగి వీడ్కోలు తెలపడం వంటివి చేశారు. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందని అనుకున్నారు. రాజ్‌భవన్, ప్రగతి భవన్ కు మధ్య రాకపోకలు సాగుతాయని భావించారు. కానీ మళ్లీ సమస్య మొదటి కొచ్చింది. గవర్నర్ కొన్ని బిల్లులను ఇంకా క్లియర్ చేయకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇద్దరి మధ్య వివాదం సమసి పోలేదన్నది స్పష్టమవుతుంది.
సీఎస్‌పై గవర్నర్ ఫైర్...
దీనిపై గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. చీఫ్ సెక్రటరీకి ట్వీట్ చేశారు. ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గరుందని గవర్నర్ అన్నారు. చీఫ్ సెక్రటరీగా పదవీ బాధ్యతలను తీసుకున్నాక తనను కలవలేదని చెప్పారు. కనీస మర్యాదగా కూడా ఫోన్లో మాట్లాడలేదన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని గవర్నర్ తెలిపారు. మళ్లీ గుర్తు చేస్తున్నా.. ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర అని గుర్తు చేస్తున్నా అని గవర్నర్ పేర్కొన్నారు.


Tags:    

Similar News