Tammineni Sitharam : సీతారాం.. ఇక రాం.. రాం చెప్పినట్లేనా?

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుతం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయినట్లుంది

Update: 2025-12-04 09:06 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుతం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయినట్లుంది. అప్పడప్పుడు కనిపిస్తున్నారు. కనీసం తన నియోజకవర్గమైన ఆముదాల వలసలో జరుగుతున్న పరిణామాలపై కూడా తమ్మినేని సీతారాం స్పందించకపోతుండటంపై వైసీపీ హైకమాండ్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. సీనియర్ నేతగా ఆయన రాష్ట్ర వ్యాప్త సమస్యలపై ఉద్యమించాల్సిన తరుణంలో కనీసం ఆముదాల వలస పరిణామాలపై కూడా స్పందించకపోవడం పై వైసీపీ నాయకత్వం సీరియస్ గా ఉంది. గతంలో ఐదేళ్ల పాటు స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారం మొన్నటి ఎన్నికలలో ఓటమి పాలయిన ఉత్తరాంధ్రలో కీలకనేత తమ్మినేని సీతారాం సైలెంట్ గా మారడం సహించలేకపోతున్నారు.

సీనియర్ నేతగా...
తమ్మినేని సీతారాం గత కొద్ది రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమ్మినేని సీతారాం రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమయింది. తర్వాత ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయిన అనంతరం తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.అయితే వైసీపీ ఆవిర్భావం తర్వాత తమ్మినేని సీతారాం వైసీపీలో చేరారు. 2014లో ఆముదాల వలస నుంచి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో గెలిచి వైసీపీ అధికారంలోకి రావడంతో స్పీకర్ గా పనిచేశారు. ఐదేళ్ల పాటు ఆయన ఏపీకి స్పీకర్ గా బాధ్యతలను నిర్వర్తించారు.రాజకీయాల్లో ఓటములు సహజం. ఓడిపోయినంత మాత్రాన పార్టీని వదిలేసుకుంటే ఎలా? అన్న ప్రశ్న క్యాడర్ నుంచి వస్తుంది.
సైలెంట్ గా ఉంటూ...
తమ్మినేని సీతారాంను ఆముదాలవలస ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా జగన్ నియమించారు. 1999 నుంచి టీడీపీ నుంచి ఆముదాలవలస లో గెలిచిన తమ్మినేని సీతారాంకు తర్వాత ఎమ్మెల్యే కావాడానికి పదేళ్ల సమయం పట్టింది. వైసీపీ నుంచి మూడు సార్లు టిక్కెట్ పొంది ఒక్కసారి మాత్రమే గెలిచారు. తమ్మినేని సీతారాం తన సమీప బంధువు టీడీపీ ఎమ్మెల్యే కూనరవికుమార్ పై కనీసం విమర్శలు చేయడానికి కూడా ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్న అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. అలాగని వైసీపీని వీడి వేరే పార్టీలో చేరే అవకాశం కూడా లేదు. ఎందుకంటే తమ్మినేని సీతారాంకు ఏ పార్టీ గేట్లు ఓపెన్ కావు. ఆ విషయం తెలిసి కూడా ఎన్నికలకు ముందు బయటకు వచ్చి చెలరేగిపోవాలని ఆయన చూస్తున్నాడేమోనన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News