భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలివే

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి

Update: 2025-12-05 12:41 GMT

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. వైద్య, ఆరోగ్య రంగాల్లో సహకారం, వలస విధానంపై పరస్పర సమన్వయం, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ సరఫరా, సముద్ర ఆహార ఉత్పత్తుల వాణిజ్యంపై ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాలను ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ సమక్షంలో నిర్వహించారు. వీటితో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలో పేతం కానున్నాయి.

రష్యా పర్యాటకులకు...
భారత్, రష్యా స్నేహం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పుతిన్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా మనకు ఎప్పటినుంచో మిత్రదేశంగా ఉందని, యూరియా ఉత్పత్తికి సహాయం చేస్తోంది. 2030 వరకు భారత్- రష్యా మధ్య ఎకనమిక్ ప్రోగ్రాం కుదుర్చుకున్నామని ప్రధానినరేంద్ర మోదీ తెలిపారు. ఆర్థిక రంగంలో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్తామన్న మోదీ భారత్ కు వచ్చే రష్యా పర్యాటకుల వీసాల నిబంధనలు సరళీకరిస్తామని అని మోదీ తెలిపారు.
ఇండియాతో కలసి పనిచేస్తాం...
భారత్ పర్యటనలో భాగంగా కుదిరిన ఒప్పందాల అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. భారత్ ఆతిథ్యం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. అనేక అంశాల్లో ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరిందని అన్నారు. భారత్-రష్యా మధ్య 64B డాలర్ల వ్యాపారం జరుగుతోందన్నారు. దీన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని పుతిన్ తెలిపారు. ఆయిల్, అణువిద్యుత్, విద్యుత్, మెడిసినల్ డ్రగ్స్ రంగాల్లో ఇండియాతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.


Tags:    

Similar News