Indigo : ఇండిగో..గో..గో.. కేంద్ర ప్రభుత్వం సీరియస్
ఇండిగో విమాన సర్వీసులు రద్దును కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
ఇండిగో విమాన సర్వీసులు రద్దును కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇండిగో వ్యవహారంపై హైలెవెల్ కమిటీని విచారణ చేయాలని ఆదేశించింది. వందలాది విమానాలు రద్దుకావడం వెనక ఏం జరిగిందన్న దానిపై అత్యున్నత విచారణకు ఆదేశించింది. మూడు రోజులుగా వందలాది విమానాలు రద్దు కావడం వెనక కారణం ఎవరన్న దానిపై విచారణ చేయాలని ఆదేశించింది. గత మూడు రోజుల నుంచి వందల సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
దీని వెనక ఎవరున్నారు?
అయితే దీనికి కారణం ఎవరు అన్నది తేల్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండిగో సంక్షోభానికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రద్దయిని విమానాలకు సంబంధించి ప్రయాణికులకు పూర్తి స్థాయిలో రీఫండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే డీజీసీఏ నోటీసులు కూడా జారీ చేసింది. ఎఫ్.డి.టీ.ఎల్ నిబంధనలను సవరించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. డీజీసీఏ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఇండిగో సేవల రద్దుపై కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయాణికుల భద్రతే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం వివరించింది. ప్రయాణికులకు వసతి కల్పించాల్సి ఉన్నా ఎందుకు కల్పించలేదని ప్రశ్నించింది.
ఉన్నతస్థాయి దర్యాప్తనకు...
ఇండిగో విమానాలు వందల సంఖ్యలో రద్దు కావడంతో డీజీసీఏ దిగి వచ్చింది. తాము తీసుకు వచ్చిన నిబంధనల్లో మార్పులు తీసుకు వచ్చింది. దేశవ్యాప్తంగా విమానాల ఆలస్యాలు, రద్దు కావడం వంటివి పెరగడంతో ఏర్పడిన ఆపరేషనల్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఎయిర్‌లైన్స్‌కి తాత్కాలిక ఉపశమనంగా డీజీసీఏ కీలక మార్పు చేసింది. వారాంత విశ్రాంతిని లీవ్‌తో మార్చకూడదని చెప్పిన పూర్వ ఆదేశాన్ని శుక్రవారం నుంచి రద్దు చేసినట్లు సంస్థ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. ఎయిర్‌లైన్స్ సంస్థల నుంచి వచ్చిన అనేక ప్రతినిధుల విజ్ఞప్తులపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం డీజీసీఏ ఉత్తర్వులను రద్దు చేస్తూ నిర్ణయిం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 2,300 విమానాలను నడుపుతున్న ఇండిగో సంస్థ ఇటువంటి నిర్ణయం తీసుకోకపపోవడం వెనక ఎవరున్నారన్న దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.