Andhra Pradesh : టీడీపీ, వైసీపీలకు విరాళాలు ఇంత భారీగా తగ్గాయా? రీజన్ ఏంటి?
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, వైసీపీకి విరాళాలు భారీగా తగ్గాయి
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, వైసీపీకి విరాళాలు భారీగా తగ్గాయి. వైసీపీకి కూడా అంతే స్థాయిలో తగ్గాయి. 2024 లో జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఈ రెండు పార్టీల విషయంలో విరాళాలు భారీగా తగ్గడంపై పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి అధికమొత్తంలో విరాళాలు అందుతాయి. కొంత మొత్తం ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో నూ లభిస్తాయి. అయితే 2024 జూన్ నెలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటకీ విరాళాలు తగ్గాయి. అదేసమయంలో మిత్ర పక్షంగా ఉన్న జనసేనకు 25.33 కోట్ల రూపాయలు అందాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే టిడిపి విరాళాలు తగ్గినట్లు కనిపిస్తుంది. ప్రముఖ ఫార్మా కంపెనీ నాట్కో రెండు పార్టీలకూ ప్రధానంగా విరాళాలను అందించింది.
గత ఆర్థిక సంవత్సరంలో...
రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి గత ఆర్థిక సంవత్సరంలో 83 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. అంతకుముందు ఏడాది ఈ మొత్తం 100 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడించాయి. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ నేతృత్వం వహిస్తున్న జనసేన పార్టీకి 2024–25లో 25.33 కోట్లకు పైగా విరాళాలు పొందినట్లు తెలిపింది. ఫార్మా సంస్థ నాట్కో విరాళాల్లో ఎక్కువ మొత్తాన్ని విరాళం రూపంలో అందించింది. నాట్కో సంస్థ తెలుగుదేశం పార్టీకి ఏడు కోట్ల రూపాయలు, జనసేనకు 1.5 కోట్ల రూపాయలను విరాళంగా అందించింది.
గతఏడాది 100 కోట్లకు పైగానే...
మరోవైపు తెలుగుదేశం పార్టీకి 2023–24లో మొత్తం 100 కోట్లకు పైగా పొందగా, అందులో 33 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చాయి. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2024–25లో మొత్తం 140 కోట్లకు పైగా విరాళం రూపంలో దక్కాయి. అందులో 113 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల మార్గంలో వచ్చాయి. నాట్కో ఫార్మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది. గత జూన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ ఓటమి చవిచూసిన తర్వాత, ఈ పార్టీకి వచ్చిన మొత్త విరాళాలు 3.94 కోట్ల రూపాయలకే పరిమితమయ్యాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి 126 కోట్ల రూపాయలు విరాళం తగ్గడం విశేషం. అందుకు ప్రధాన కారణం అధికారంలో లేకపోవడమే.