ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని?
ఓటుకు నోటు కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. నేడు ఈ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు ఈ కేసులో ఉన్న మొత్తం [more]
ఓటుకు నోటు కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. నేడు ఈ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు ఈ కేసులో ఉన్న మొత్తం [more]
ఓటుకు నోటు కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. నేడు ఈ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు ఈ కేసులో ఉన్న మొత్తం ఐదుగురు నిందితులు హాజరు కావాల్సి ఉంది. ఇందులో ఏ1 నిందితుడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన ప్రస్తుతం వేరే కేసులో జైలులో ఉన్నారు. జైలులో ఉన్న రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసు విచారణలో హాజరు పరుస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే 690 పేజీల నివేదికను ఈ కేసుకు సంబంధించి అధికారులు కోర్టుకు సమర్పించారు. కేసు విచారణ వేగంగా జరుగుతుండటంతో కీలక తీర్పు త్వరలోనే వెలువడే అవకాశముందంటున్నారు.