త్వరలో భారత్ కు నీరవ్ మోదీ

ప్రముఖ పారిశ్రామిక వేత్త నీరవ్ మోదీని భారత్ కు తీసుకువచ్చేందుకు మార్గం సుగమమయింది. ఈ మేరకు బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. [more]

Update: 2021-04-17 01:27 GMT

ప్రముఖ పారిశ్రామిక వేత్త నీరవ్ మోదీని భారత్ కు తీసుకువచ్చేందుకు మార్గం సుగమమయింది. ఈ మేరకు బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. దీంతో త్వరలోనే నీరవ్ మోదీని భారత్ కు తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. నీరవ్ మోదీ బ్యాంకుల రుణాల ఎగవేత కేసుల్లో నిందితులు. ఆయన బ్యాంకుల నుంచి 14 వేల కోట్ల రుణం తీసుకుని విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఆయనను భారత్ రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు నీరవ్ మోదీని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ఫలించాయి.

Tags:    

Similar News