ఆగడం లేదే? రోజుకు వెయ్యి మంది వరకూ?

భారత్ లో కరోనా వ్యాధి వ్యాప్తి ఆగడం లేదు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 14, 378 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 480 [more]

Update: 2020-04-18 03:57 GMT

భారత్ లో కరోనా వ్యాధి వ్యాప్తి ఆగడం లేదు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 14, 378 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 480 మంది మృతి చెందారు. రోజుకు వెయ్యికొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. గడిన 24 గంటల్లో 991 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 43 మంది మరణించారు. ప్రధానంగా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ కరోనా వ్యాధి నుంచి 1491 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ముంబయి ఇండియన్ నావికాదళంలోనూ ఇరవై మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. వీరిని ముంబయిలోని అశ్విన్ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News