ఇదేందయ్యా... ఇలాగయితే ఎలాగయ్యా?

telugudesam party chief chandrababu naidu should be told that the municipal elections were shocking.

Update: 2021-11-17 06:59 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మున్సిపల్ ఎన్నికలు షాకిచ్చాయనే చెప్పాలి. మూడు ప్రాంతాల్లో ఎక్కడా టీడీపీకి ఫలితాలు అనుకూలంగా లేవు. కేవలం ఒక్క మున్సిపాలిటీలోనే టీడీపీ విజయం సాధించింది. అక్రమాలు జరిగాయని తప్పించుకోవచ్చు. వైసీపీ దౌర్జన్యాలని చెప్పి చంద్రబాబు డైలాగ్ లు కొట్టవచ్చు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే ప్రజలు టీడీపీకి అనుకూలంగా లేరన్నది మరోసారి అర్థమయింది. సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీ చేజారిపోవడం రాష్ట్రంలో టీడీపీ దుస్థితికి అద్దం పడుతుంది.

ఆత్మ పరిశీలనకు...
చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కేవలం రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాయతీ అని ప్రజలను డైవర్ట్ చేయాలనుకుంటే పొరపాటే. జనంలోకి వెళ్లకుండా పార్టీ కార్యాలయంలో కూర్చుని వైసీపీ పై నిందలు వేస్తే ప్రజలు పట్టించుకోరని ఇప్పటికే అనేక ఫలితాలు వెల్లడించాయి. కానీ చంద్రబాబు మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు. అనుకూల మీడియా సహకారంతో అందలం ఎక్కవచ్చని భావిస్తున్న చంద్రబాబుకు కుప్పం ఫలితాలే గుణపాఠం చెప్పాయని అనుకోవాలి.
ఎన్ని అక్రమాలు చేసినా?
నిజానికి కుప్పంలో అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడి ఉండవచ్చు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి ఉండవచ్చు. కానీ నువ్వు మూడు దశాబ్దాలుగా కుప్పంలో ఉండి సాధించిందేమిటన్న సందేహం ఖచ్చితంగా కలుగుతుంది. ఏడు సార్లు కుప్పం ప్రజలు గెలిస్తే అక్కడ నీ పట్టేమిటన్న ప్రశ్న తెలెత్తుతోంది. ఎన్ని ప్రలోభాలు పెట్టినా నీ నాయకత్వం సరిగ్గా ఉంటే ప్రజలు ఎందుకు అటు వైపు మొగ్గు చూపుతారు. దొంగ ఓట్లంటూ తప్పించుకోవడానికి చూస్తే నిన్ను ఏమీ అనలేం. నీ ఖర్మ అని వదిలేయడం తప్ప.
అన్ని చోట్లా మంచి ఫైట్ ఇచ్చినా?
ఇక మిగిలిన మున్సిపాలిటీల్లో నాయకత్వం ఉన్న చోట కొద్దో గొప్పో టీడీపీ పోరాడింది. దాచేపల్లిలో మంచి ఫైట్ ఇచ్చింది. 12 మున్సిపాలిటీల్లో కుప్పం తప్ప అన్ని చోట్లా టీడీపీ కొద్దోగొప్పో ఫైట్ ఇచ్చింది. దీనిని ఏమనుకోవాలి. నాయకత్వ సమస్య అనుకోవాలా? ఇప్పటికైనా చంద్రబాబు పరనిందలను మానుకుని ఆత్మపరిశీలన చేసుకోవడం మంచిది. లేదు.. నేనింతే అని అనుకుంటే వచ్చే ఏ ఎన్నికల్లో అయినా ఇదే రకమైన ఫలితాలు చూడక తప్పదు. నాయకత్వం ఉన్నా ప్రజల్లో నమ్మకం కల్గించలేకపోవడమే ఈ ఓటమికి ప్రధాన కారణం.


Tags:    

Similar News